వ‌ణికిస్తున్న‌ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ.. వాటిని చంపడానికి ప్రభుత్వం ఆదేశాలు!

September 24, 2020 at 9:00 am

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను కంటికి క‌నిపించ‌ని క‌రోనా ఏ స్థాయిలో అత‌లాకుత‌లం చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ మ‌హ‌మ్మారి ధాటికి ఇప్ప‌టికే 9 ల‌క్ష‌ల మందికి పైగా మృత్యువాత ప‌డ్డారు. ఒక ఓ వైపు క‌రోనా వేగంగా విజృంభిస్తున్న వేళ‌.. మ‌రోవైపు అసోంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వ‌ణికిస్తోంది. ప్రమాదకర ఈ ఫ్లూ కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 14 జిల్లాల్లో 18 వేలకు పైగా పందులు మృత్యువాత పడ్డాయి.

ఈ క్ర‌మంలోనే ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో 12 వేల పందులను చంపేయాలని అసోం ప్రభుత్వం బుధవారం ఆదేశించింది. దీనిని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో వాటి యజమానులకు పరిహారం అందించాలన్నారు.

ఈ మేర‌కు అసోం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అసోం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా, నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పందులను వధించాలని, దసరాకు ముందే ఈ పని పూర్తిచేయాలని ఆదేశించారు. తక్షణమే ఈ చర్యలు ప్రారంభించినట్టు సూచించారు.

వ‌ణికిస్తున్న‌ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ.. వాటిని చంపడానికి ప్రభుత్వం ఆదేశాలు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts