ప‌వ‌న్‌కు పోటీగా అఖిల్‌.. ఈసారి ర‌చ్చ ర‌చ్చే!

September 19, 2020 at 8:36 am

అక్కినేని వారసుడు అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అఖిల్ స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాస్, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల ఈ మూవీ షూటింగ్ మళ్లీ తిరిగి ప్రారంభమైంది.

ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయ‌డానికి చిత్ర‌యూనిట్ ప్లాన్ చేస్తోంది. మ‌రి అది సంక్రాంతి రోజైన 14వ తేదీన లేకపోతే సంక్రాంతి ముందురోజు 13వ తేదీన అనేది తేలాల్సి ఉంది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కం బ్యాక్ చిత్రం `వకీల్ సాబ్` కూడా అదే సమయాన్ని లాక్ చేసుకున్నట్టు టాక్ న‌డుస్తోంది. దీని బ‌ట్టీ చూస్తే.. ప‌వ‌న్‌తో అఖిల్ పోటీ ప‌డునున్నాడ‌ని స్ప‌ష్టం అవుతోంది.

కాగా, మ‌రోవైపు మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న `క్రాక్`, నాగ చైతన్య నటించిన `లవ్ స్టోరీ` కూడా సంక్రాంతి పండ‌గ‌నే టార్గెట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, మరో భారీ చిత్రం `కేజీయఫ్ చాప్టర్ 2` కూడా లైన్ లో ఉన్న‌ట్టు స‌మాచారం. ఈ లెక్క‌న చూస్తే 2021 సంక్రాంతికి హీరోలంద‌రూ ర‌చ్చ ర‌చ్చ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ప‌వ‌న్‌కు పోటీగా అఖిల్‌.. ఈసారి ర‌చ్చ ర‌చ్చే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts