తాగొచ్చి కొడుతున్న భార్య.. భ‌ర్త ఏం చేశాడంటే?

September 20, 2020 at 1:03 pm

సాధార‌ణంగా భ‌ర్త‌లు తాగొచ్చి భార్య‌, పిల్ల‌ల‌ను కొడుతున్న సంఘ‌ట‌న‌లు ఎప్ప‌టిక‌ప్ప‌డు చూస్తేనే ఉంటాం. ముఖ్యంగా మన దేశంలో ప్రతిరోజు ఏదో ఒక మూలాన ఇలాంటి సంఘటనలు ఎన్నో జ‌రుగుతున్నాయి. అయితే విచిత్రంగా భార్య తాగొచ్చి భ‌ర్త‌ను చిత‌క‌బాదుతుంది ఓ ఇల్లాలు‌. ఈ విచిత్ర ఘ‌ట‌న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నగరంలోని మణినగర్ ఏరియాకి చెందిన యువకుడు(29) ఓ యువతితో 2018 మార్చిలో వివాహం చేసుకున్నాడు. పెళ్లి తరువాత అతగాడికి తన భార్య రోజు తాగుతుంద‌ని తెలుసుకున్నాడు. ఈ విష‌యంలో భార్య‌తో గొడ‌వ పెట్టుకున్నాడు భ‌ర్త‌. ఇక అప్ప‌టి నుంచి తాగొచ్చి భర్తని కొట్టడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే తాను ఇంట్లో ఏకాంతంగా ఉండాలని.. అత్తమామలను వెళ్లగొట్టాలని భర్తపై ఒత్తిడి చేసింది.

ఆమె టార్చర్ తట్టుకోలేక ఆమె భర్త తల్లితండ్రులు వేరుగా ఉంటున్నారు. ఆ త‌ర్వాత ఇంటిని త‌న పేరు మీద రాయాలంటూ భ‌ర్త‌ను, అత్త మామ‌ల‌పై వేధింపులకు దిగింది. దీంతో చివ‌ర‌కు తనకు, తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్ర‌యించారు భర్త. ప్ర‌స్తుతం కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. మ‌రోవైపు ఈ విచిత్ర ఘ‌ట‌న నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది.

తాగొచ్చి కొడుతున్న భార్య.. భ‌ర్త ఏం చేశాడంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts