బిగ్ బాస్ హోస్ లో అల్లరి నరేష్ హీరోయిన్స్ సందడే సందడి..!

September 23, 2020 at 6:22 pm

మా టీవీ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ సీజన్ 4 కు ప్రేక్షకులు నుంచి బాగానే ఆదరణ వచ్చింది. ఇప్పటికే ఈ షో మొదలై రెండు వారాలు అవుతుంది. అయితే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లోకి రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చారు. ఒకరు కమెడియన్ కుమార్ సాయి కాగా మరొకరు జబర్దస్త్ అవినాష్. అయితే ఈ సీజన్‌కు ఈ రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలే ఉంటాయని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉందని ఎవరు ఊహించలేదు. అయితే ఈ సారి అబ్బాయిని కాకుండా అమ్మాయిని రంగంలోకి దించుతున్నారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు. మన అల్లరి నరేష్ సినిమా హీరోయిన్. ఆమె పేరు స్వాతి దీక్షిత్. తెలుగులో కొన్ని సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ.

 

ఈమె కూడా అల్లరి నరేష్‌తో రొమాన్స్ పండించింది. జంప్ జిలానీ సినిమాలో ఈమె రెండో హీరోయిన్‌గా నటించింది. అయితే ఇంట్లో ఇప్పటికే అల్లరి నరేష్ తో నటించిన మోనాల్ గజ్జర్, హారిక, దివి, అరియానా లాంటి అందమైన అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు వీళ్లకు తోడుగా మరో బ్యూటీని తీసుకొస్తున్నారు నిర్వాహకులు. తెలుగులో కొన్ని సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక్కడ గమనించాలిసిన విషయం ఏంటంటే ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లో అల్లరి నరేష్ హీరోయిన్లు సందడి చేస్తూ కనిపిస్తూ ఉండడం గమనించదగ్గ విషయం.. మరి స్వాతి దీక్షిత్ ఎంత వరకు హౌస్ లో నెగ్గుకువస్తుందో చూడాలి మరి..!

బిగ్ బాస్ హోస్ లో అల్లరి నరేష్ హీరోయిన్స్ సందడే సందడి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts