బాలయ్యకు అసిస్టెంట్ గా మార‌బోతున్న‌ అల్లరి నరేష్?

September 14, 2020 at 7:53 am

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటితో `బిబి3` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న బాల‌య్య‌ను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకురావడానికి ఒక పవర్‌ఫుల్ స్టోరీని తయారుచేశాడు బోయ‌పాటి. ఇక బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ మూడో సినిమాపై అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు.

ఇదిలా ఉంటే.. మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో బాలయ్యకు అసిస్టెంట్‌గా అల్ల‌రి న‌రేష్ క‌నిపించ‌బోతున్నాడ‌ని టాక్ న‌డుస్తోంది. అంతేకాదు, జస్ట్ అసిస్టెంట్ రోల్ అయినా, ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ రోల్ కాస్త కీలకమైనది అని.. అలాగే ఈ రోల్ నుండే ఫన్ జనరేట్ అవుతుందని తెలుస్తోంది.

అందుకే కొంచెం ఫేమ్ ఉన్న హీరో అయితే మంచిద‌ని అని.. అందుకే ఈ రోల్ కోసం అల్లరి నరేష్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. మ‌రి ఆ రోల్‌కు అల్ల‌రి న‌రేష్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారో.. లేదో.. తెలియాల్సి ఉంది. కాగా, ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో సినిమా వాయిదా పడింది. మ‌రోవైపు ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న న‌టించే హీరోయిన్‌పై సైతం క్లారిటీ రావాల్సి ఉంది.

బాలయ్యకు అసిస్టెంట్ గా మార‌బోతున్న‌ అల్లరి నరేష్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts