`మోసగాళ్లు`తో చేతులు క‌లిపిన అల్లు అర్జున్‌?

September 30, 2020 at 11:47 am

గ‌త కొంత కాలంగా వ‌రుస ప‌ర‌జాయ‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న మంచు విష్ణు ప్ర‌స్తుతం `మోసగాళ్లు` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని హాలీవుడ్ ద‌ర్మ‌కుడు జెఫ్రీ గీ చిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. 24 ఫిలిం ఫ్యాక్ట‌రీ, ఏవీఏ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌ల‌పై మంచు విష్ణు స్వ‌యంగా నిర్మిస్తున్నారు. వరల్డ్ బిగ్గెస్ట్ స్కామ్ పాయింట్ ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

Kajal Aggarwal's new poster from Mosagallu creates intrigue | Telugu Movie  News - Times of India

ఇక ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని పాన్ ఇండియన్ ఫ్లిక్ గా రెడీ చేయనున్నారు. ఇటీవలే విడుదల చేసిన పోస్టర్స్ కు మంచి హైప్ రాగా ఇపుడు మరింత హైప్ ఇచ్చేందుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మోసగాళ్ళతో చేతులు కలిపాడు. ఈ క్ర‌మంలోనే మోస‌గాళ్లు చిత్రం తాలుకా టీజర్ ను బన్నీ చేతుల మీదుగా అక్టోబర్ 3న విడుదల చేయనున్నట్టుగా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

Mosagallu Scam To Be Exposed By Bunny

కాగా, ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్, మంచు విష్ణు అన్నాచెల్లెలిగా క‌నిపించ‌బోతున్నారు. అలాగే సునీల్ శెట్టి, న‌వ‌దీప్ త‌దిత‌రులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక సొంత ప్రొడక్షన్ సినిమాను నిర్మించిన విష్ణు ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. పైగా గతంలో కంటే ఈ సినిమాకు ఎక్కువగానే ఖర్చు చేస్తున్నాడు.

`మోసగాళ్లు`తో చేతులు క‌లిపిన అల్లు అర్జున్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts