`పుష్ప` విష‌యంలో కీల‌క నిర్ణ‌యం.. బ‌న్నీ రిస్క్ తీసుకుంటున్నాడా?

September 24, 2020 at 2:44 pm

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్నా న‌టిస్తోంది. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప తెరకెక్కుతుంది.

పుష్పక్ నారాయణ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు బన్నీ. ఇప్ప‌టికే కేరళ అడవుల్లో ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. ఇక బన్నీ కూడా షూట్ లో జాయిన్ అవుతాడనుకుంటున్న తరుణంలో లాక్ డౌన్ రావడం.. షూటింగ్ ఆగిపోయింది. ఇక క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాపిస్తుండ‌డంతో.. కేరళ అడవులను వదిలేసి మహబూబ్ నగర్ అడవుల్లో షూటింగ్ చేద్దామని ఇటీవల ప్లాన్ చేశారు.

అయితే ఇప్పుడు చిత్ర‌టీమ్ పుష్ప షూటింగ్ విష‌యం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్ అడవుల్లో.. ముందుగా తాము అనుకున్న‌, కోరుకున్న లొకేషన్లు వుండే కేరళకే వెళ్లాలని ఇప్పుడు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు, నవంబర్ మొదటి వారంలో కేరళ అడవుల్లో ఈ చిత్రం షూటింగును షురూ చేసేందుకు స‌న్నాహాలు కూడా చేస్తున్నార‌ట‌. మ‌రి క‌రోనా స‌మ‌యంలో కేర‌ళ‌లో షూటింగ్ అంటే కాస్త రిస్క్‌లో కూడుకున్న ప‌నే అని చెప్పాలి. కాగా, పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

`పుష్ప` విష‌యంలో కీల‌క నిర్ణ‌యం.. బ‌న్నీ రిస్క్ తీసుకుంటున్నాడా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts