ఇక వాయిస్‌తోనే స్విచ్‌ల‌ను ఆన్ ఆఫ్ చేయ‌వ‌చ్చు..

September 16, 2020 at 8:29 pm

సాంకేతిక ప‌రిజ్ఞానం రోజురోజుకూ కొత్త పుంత‌లు తొక్కుతున్న‌ది. కద‌ల‌కుండా కూర్చున్న చోటు నుంచే ప‌నుల‌ను చ‌క్క‌బెట్టుకునే వెసులు బాటు క‌లుగుతుంది. పెద్ద‌గా శ్ర‌మ‌లేకుండానే పోతున్న‌ది. సాంకేతిక‌ప‌రంగా కొత్త ప‌రిక‌రాల‌ను తీసుకురావ‌డంలో ముందుండే ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్ మ‌రో సరికొత్త ప్రొడక్టును భారత్‌లో ఆవిష్కరించింది. స్మార్ట్‌ డివైజ్‌ విభాగంలో స్మార్ట్‌ ప్లగ్‌ను విడుద‌ల‌ను చేసింది. దీని ప్ర‌త్యేక‌త ఏమిటంటే వాయిస్‌ కమాండ్స్ ద్వారా అప్లయెన్సెస్‌ను కంట్రోల్‌ చేయడం. అలెక్సా యాప్‌ లేదా అలెక్సా ఉన్న స్మార్ట్‌ స్పీకర్‌ ద్వారా స్మార్ట్‌ ప్లగ్‌ను నియంత్రించవచ్చు. దీంతో కూర్చున్న చోటు నుంచే స్విచ్‌ల‌ను ఆన్ ఆఫ్ చేసే వెసులుబాటు క‌లుగుతుంది.

భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ 6A సాకెట్‌ను రూపొందించిన‌ట్లు ఆమెజాన్ కంపెనీ వెల్ల‌డించింది. అంతేకాదు ఇది విద్యుత్తు అంతరాయాల సమయంలో సమర్థ‌వంతంగా నిర్వహించగలదని తెలిప‌డం విశేషం. అంతేకాదు స్మార్ట్‌ప్లగ్‌కు కనెక్ట్‌ అయిన టీవీ, ల్యాంప్‌, ఫ్యాన్, మొబైల్‌ ఛార్జర్‌, ఏసీ ఇలా ఏ డివైజ్‌నైనా దీని ద్వారా ఆన్‌/ఆఫ్ చేయ‌గ‌ల‌గ‌డం మ‌రో విశేషం. విద్యుత్ సాకెట్‌లో దీనిని అమ‌ర్చిన కొన్ని నిమిషాల నుంచే ఈ ప్లగ్ త‌న పనిని మొద‌లు పెడుతుంది. కేవ‌లం తెలుపు రంగులో మాత్ర‌మే ల‌భించ‌నున్న అమెజాన్‌ స్మార్ట్‌ ప్లగ్‌ ధర రూ.1,999గా నిర్ణయించిన‌ట్లు ఆమెజాన్ వెల్ల‌డించింది. ప్లగ్‌ను ఆన్‌లైన్‌లో అమెజాన్‌ ఇండియాతో పాటు క్రోమా, రిలయన్స్‌ డిజిటల్‌ ఔట్‌లెట్లలో కూడా కొనుగోలు చేసుకోవ‌చ్చు.

ఇక వాయిస్‌తోనే స్విచ్‌ల‌ను ఆన్ ఆఫ్ చేయ‌వ‌చ్చు..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts