ఫీల్మ్ ఛాంబర్ లో ఎస్పీ బాలు విగ్రహాన్ని ప్రతిష్టించాలి : ఆనంద్

September 29, 2020 at 3:59 pm
balu

మహా గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. 6 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కీర్తించారు. బాలు మంచి సమయస్ఫూర్తి ఉన్న మనిషి. సూక్ష్మగ్రాహి. ఆయన తన జీవితంలో ఒడిదొడుకులకు తావివ్వలేదు. గాన గాంధర్వుడు ఎస్పీ బాలు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. జెండరీ సింగర్ మరణంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. యావత్ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రతి ఆలయంలో ఆయన పాటలే వినిపిస్తాయి.

భక్తి పారవశ్యంతో ఆయన పాడిన పాటలు చిరకాలం నిలిచిపోతాయి. బాలు మరణం సినీ ప్రపంచానికి తీరని లోటని డైరెక్టర్, డాక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన బాలుతో ఆయనకున్న అనుబందాలు పంచుకున్నారు. అయితే రాబోయే తరలాకు ఆయన ఆదర్శంగా ఉండాలా బాలు విగ్రహాన్ని ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిరస్థాయిగా నిలిచేందుకు సత్కారాలను అందించాలన్నారు.

ఫీల్మ్ ఛాంబర్ లో ఎస్పీ బాలు విగ్రహాన్ని ప్రతిష్టించాలి : ఆనంద్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts