ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉధృతి…! నేడు కొత్తగా 7073 కేసులు నమోదు…!

September 25, 2020 at 7:02 pm

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య ప్రతిరోజు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు ఆరోగ్య అధికారులు, మరోవైపు పోలీసు అధికారులు ఎంత కష్టపడినా చివరికి కరోనా వైరస్ వ్యాప్తి మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా గడచిన 24 గంటలలో నమోదైన కరోనా కేసుల వివరాలను తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెల్త్ మరియు కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ బులిటెన్ మీడియా పూర్వకంగా విడుదల చేసింది. తాజాగా 69,429 శాంపిల్స్ ను రాష్ట్రవ్యాప్తంగా పరీక్షించిన అందులో 7073 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 6,58,563 కు చేరుకుంది. మరోవైపు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 8695 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. దీంతో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో 5,85,274 మందికి కరోనా నుండి కోలుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 67,683 కరోనా కేసులు కొనసాగుతున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 45 మంది కరోనా వైరస్ బారినపడి మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నేటి వరకు కరోనా బారినపడి మృతి చెందినవారి సంఖ్య 5,606 కు చేరుకుంది. ఇక ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 92,173 కేసులు నమోదయ్యాయి. అలాగే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 625 కరోనా మరణాలు సంభవించాయి.

ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉధృతి…! నేడు కొత్తగా 7073 కేసులు నమోదు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts