ఏపీ రైతన్నలకు జ‌గ‌న్ స‌ర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్‌!

September 23, 2020 at 9:29 am

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాల‌కు చుక్క‌లు చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. వ్యాక్సిన్ లేని ఈ ప్రాణాంతక మ‌హ‌మ్మారి అడ్డు అదుపు లేకుండా వేగంగా విజృంభిస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించటంలో ముందు వరుసలో ఉంటుంది.

ఇక తాజాగా ఏపీ రైత్త‌న్న‌ల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్ అందించింది. సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించే ‘వైఎస్సార్‌ జలకళ’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. సెప్టెబ‌ర్‌ 28వ తేదీన ఈ పెద్ద పథకాన్ని జ‌గ‌న్ ప్రారంభించ‌నున్నారు.

ఈ ప‌థ‌కం ద్వారా వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1.98 లక్షల మంది పేద రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికీ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వేర్వేరుగా ఎంపిక చేసిన బోర్‌ రిగ్‌ వాహనాలను సీఎం జ‌గ‌న్‌ 28న జెండా ఊపి ప్రారంభిస్తారు.

ఏపీ రైతన్నలకు జ‌గ‌న్ స‌ర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts