సన్ రైజర్స్ జట్టులో మిచెల్ మార్ష్ ఆ స్థానాన్ని భర్తీ చేయనున్న మరో విదేశీ ఆటగాడు…!

September 23, 2020 at 6:05 pm

ఐపీఎల్ 2020 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తన మొట్టమొదటి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తో ఆడింది. అయితే చివరి వరకు హోరా హోరీగా సాగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 10 పరుగుల తేడాతో బెంగళూరు చేతిలో ఓటమిని తప్పించుకోలేకపోయింది. ఇక ఆ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేయగా టార్గెట్ చేజింగ్ చేసే సమయంలో సన్ రైజర్స్ జట్టు కేవలం 153 పరుగులకే ఆల్ అవుట్ అయిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ జట్టుకు భారీ నష్టమే జరిగింది. మిచెల్ మార్ష్ బౌలింగ్ చేస్తున్న సమయంలో గాయాల పాలయ్యాడు. దీంతో అతను వచ్చే మ్యాచ్ కు అందుబాటులో లేకుండా పోయాడు.

దీంతో ఇప్పుడు మిచెల్ మార్ష్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న ఈ విషయంపై అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇక ఈ విషయం సంబంధించి తాజాగా సన్ రైజర్స్ యాజమాన్యం అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఇందుకు సంబంధించిన ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ఆ విధంగా చూస్తే మిచెల్ మార్ష్ గాయం కారణంగా తప్పుకుంటున్నట్లు తెలియజేసింది. వీలైనంత త్వరగా అతను కోలుకోవాలని తాము ఆశిస్తున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా అతని స్థానంలో ఐపీఎల్ 2020 లో జాసన్ హోల్డర్ ఆడనున్నట్లు టీం యాజమాన్యం తెలియజేసింది. ఇక ఐపీఎల్ 2020 సన్ రైజర్స్ జట్టుకు రెండో మ్యాచ్ ఈ నెల 26వ తేదీన అబుదాబిలో కోల్కత్తా నైట్ రైడర్స్ తో ఆడనుంది.

 

సన్ రైజర్స్ జట్టులో మిచెల్ మార్ష్ ఆ స్థానాన్ని భర్తీ చేయనున్న మరో విదేశీ ఆటగాడు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts