హేమంత్ కేసులో మరో ఆసక్తికర అంశం..!

September 27, 2020 at 5:52 pm

హేమంత్, అవంతి ప్రేమ వివాహం చేసుకోగా, కక్షగట్టిన అవంతి కుటుంబ సభ్యులు హేమంత్ ను దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే…. అయితే పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెల్లడవుతున్నాయి. హేమంత్, అవంతిలకు పరిచయం ఏర్పడకముందే వారిద్దరి తల్లులు క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలుస్తోంది.

హేమంత్ తల్లి రాణి, అవంతి తల్లి అర్చన ఇద్దరూ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. అవంతి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా హేమంత్ తల్లి రాణి బ్యూటీషియన్ గా వెళ్లేది. ఈ క్రమంలో హేమంత్ తల్లితో అవంతి దగ్గరైంది. ఆపై హేమంత్ తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. హేమంత్, అవంతిలు ప్రేమ వివాహం చేసుకోకముందు, ఇరువురి కుటుంబ సభ్యులు ఒకరి ఇంట్లో శుభకార్యాలకు మరొకరు వెళ్లేవారు. అయితే అవంతి, హేమంత్ ల ప్రేమ వ్యవహారం రెండు కుటుంబాల మధ్య చిచ్చు రేపింది.

హేమంత్, అవంతిని తీసుకుని వెళ్లి పెళ్లి చేసుకోవడాన్ని అవంతి కుటుంబసభ్యులు భరించలేకపోయారు. ఈ కారణంగానే హేమంత్ ను చంపేశారని పోలీసులు తెలుసుకున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు 14 మందిని రిమాండ్ లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కానీ సందీప్ రెడ్డి, ఆశిష్ రెడ్డి అనే మరో ఇద్దరు ఈ హత్యలో కీలక నిందితులని, హత్యకు పథకం వేసిందే వారిద్దరూ అని అవంతి ఆరోపిస్తోంది.

హేమంత్ కేసులో మరో ఆసక్తికర అంశం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts