ప్రభాస్ `ఆదిపురుష్‌`లో సీత‌గా అనుష్క‌.. క్లారిటీ ఇచ్చిన స్వీటీ!

September 30, 2020 at 8:42 am

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ర‌ధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో `రాధేశ్యామ్‌` చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ తో ఓ సినిమా చేయ‌నున్నారు. అలాగే మ‌రోవైపు ఓమ్‌ రౌత్ తెరకెక్కిస్తోన్న పౌరాణిక భారీ బడ్జెట్‌ చిత్రం `ఆదిపురుష్‌` ను కూడా చేస్తున్న‌ట్టు ప్ర‌భాస్ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ మూవీని టీ-సిరీస్ నిర్మిస్తోంది.

3డీలో తెరకెక్కనున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, సైఫ్‌ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మిగిలిన పాత్రాధారులకు సంబంధించి నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ క్రమంలో ఇందులో సీత పాత్రకు గానూ అనుష్క శెట్టి పేరు తెర‌పైకి వ‌చ్చింది. అయితే దీనిపై తాజాగా అనుష్క క్లారిటీ ఇచ్చింది.

స్వీటీ నటించిన ‘నిశ్శబ్దం’ త్వరలో ఓటీటీ ద్వారా విడుదల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సందర్బంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడిన అనుష్క ‘ఆదిపురుష్’ టాపిక్ రాగానే ఆ వార్తల్లో నిజం లేదని, తనకు అలాంటి ఆఫర్ ఏదీ రాలేదని స్ప‌ష్ట‌త‌ ఇచ్చింది. దీంతో ప్రభాస్, అనుష్కలు మరోసారి జోడీ క‌డుతున్నారు అనే రూమ‌ర్స్‌కు చెక్ ప‌డింది.

ప్రభాస్ `ఆదిపురుష్‌`లో సీత‌గా అనుష్క‌.. క్లారిటీ ఇచ్చిన స్వీటీ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts