`నిశ్శబ్దం`పై కీల‌క ప్ర‌క‌ట‌న‌.. విడుద‌ల ఎప్పుడంటే?

September 18, 2020 at 2:28 pm

లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనుష్క చాలా గ్యాప్ త‌ర్వాత న‌టించిన చిత్రం `నిశ్శబ్దం`. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్నికోన వెంకట్‌, టీజీ విశ్వప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించారు. క్రాస్‌ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో మాధవన్‌, షాలినిపాండే, అంజలి, సుబ్బరాజు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇక ఇప్ప‌టికే ఈ చిత్రం విడుద‌ల కావాల్సి ఉంది.

కానీ, మాయ‌దారి క‌రోనా దాప‌రించ‌డంతో థియేట‌ర్లు మూత‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే నిశ్శబ్దం చిత్రం కూడా విడుద‌ల వాయిదా వేసుకుంది. అయితే అదే సమయంలో అనేకసార్లు ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతుందనే వార్తలు సోషల్‌ మీడియాలో జోరందుకున్నాయి. దీంతో తరచూ చిత్ర యూనిట్‌ స్పందించి ఆ వార్తలను ఖండించడం కూడా కామ‌న్‌గా మారింది.

అయితే ఎట్ట‌కేల‌కు నిశ్శబ్దం పై చిత్రటీమ్‌ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. గాంధీ జయంతి సందర్భంగా తెలుగు, తమిళ్‌, మలయాళంలో అక్టోబర్ 2న నిశ్శబ్దం చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. అటు అమెజాన్ ప్రైమ్ కూడా ఈ విషయాన్ని ప్ర‌క‌టించింది. కాగా, దాదాపు రెండేళ్ల గ్యాప్‌తో అనుష్క చేస్తున్న సినిమా కావడంతో.. ఈచిత్రం కోసం అభిమానులు, ఆడియెన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

`నిశ్శబ్దం`పై కీల‌క ప్ర‌క‌ట‌న‌.. విడుద‌ల ఎప్పుడంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts