గావస్కర్ పై మండి పడ్డ అనుష్క శర్మ

September 25, 2020 at 7:10 pm

భారత సారథి విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మపై టీమిండియా మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్ లో నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన బెంగళూర్, పంజాబ్ మ్యాచ్ వ్యాఖ్యాతగా ఉన్న గావస్కర్ అనుష్కపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఫీల్డింగ్ చేస్తూ రెండు క్యాచ్ లు చేజేతులా వదిలిపెట్టి, ప్రత్యర్థి కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీకి బాటలు వేశాడు. ఆపై బ్యాటింగ్ లోనూ ఘోరంగా ఆడాడు. 5 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ కేవలం 1 పరుగు చేసి కాట్రెల్ బౌలింగ్ లో అవుటయ్యాడు. దీనిపై కామెంట్రీ బాక్స్ లో ఉన్న క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సరదాగా స్పందించారు. లాక్ డౌన్ సమయంలో కోహ్లీ తన భార్య అనుష్క శర్మ బౌలింగ్ ను మాత్రమే ఆడినట్టు ఉందని చమత్కరించారు.

ఈ వాఖ్యలను అనుష్క శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్టర్ గావస్కర్ ీరు చేసిన వ్యాఖ్యలు చాలా ఇబ్బందికరమైనవి. దానిపై మీ వివరణ వినాలనుకుంటున్నా.. ఓ క్రికెటర్ సతీమణిపై అలాంటి వ్యాక్యలు ఎందుకు చేశారు..? తన భర్త ఆటలో భార్య గురించి ఎందుకు ప్రస్తావిస్తావించారు…? గత కొన్నెళ్లుగా క్రికెటర్ల వ్యక్తిగత జీవితాలకు మీరు మర్యాద ఇస్తున్నారు. వాళ్లందరిలా మాపై కూడా ఉండాలని మీరు కోరుకోవట్లేదా..? నిన్ని మ్యాచ్లో నా భర్త ఆట తీరుపై విమర్శించడానికి మీ దగ్గర ఎన్నో మాటలు ఉండి ఉంటాయి. కానీ నా గురించి ప్రస్తావిస్తేనే మీకు సమయోచితంగా అనిపిస్తుందా..? చెత్త కామెంట్స్ చేయడం ఎప్పుడు మానేస్తారు…? అంటూ అనుష్క శర్మ పేర్కొన్నారు. గౌరవనీయ సునీల్ గవాస్కర్ గారూ మీరో దిగ్గజం. మీ మాటలు విన్నప్పుడు నాకేమనిపించిందో చెప్పాలనే ఈ పోస్టు చేస్తున్నాను” అంటూ అనుష్క ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు.

గావస్కర్ పై మండి పడ్డ అనుష్క శర్మ
0 votes, 0.00 avg. rating (0% score)