బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అనుష్క.. ఇక ర‌చ్చ ర‌చ్చే?

September 27, 2020 at 7:35 am

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్ ఇటీవ‌ల ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే బిగ్ బాస్ హౌస్ నుంచి ఇద్ద‌రు ఎలిమినేట్ కాగా.. ముగ్గురు వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మూడో వారం ఎవ‌రు సేవ్ అవుతారు.. ఎవ‌రు ఇంటి నుంచి ఎలిమినేట్ అవుతారు అన్న ఉత్కంఠ‌ ప్రేక్షకుల మ‌దిలో నెల‌కొంది. ఇక శని, ఆదివారాలు బిగ్ బాస్ ప్రేక్షకులకు వెరీ స్పెషల్.

ఎందుకంటే హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి హౌజ్‌మేట్స్‌ను ఓ ఆట ఆడుకునేది ఈ రెండు రోజులే. ఇప్పటికే నిన్న శ‌నివారం పూర్తి కాగా.. లాస్య, మోనాల్‌ సేవ్ అయిన‌ట్టు నాగ్ తెలిపారు. మ‌రి నేడు ఆదివారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు అన్న‌ది తేలిపోనుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ వార్త తెగ వైర‌ల్‌గా మారింది. అక్టోబర్ 2న ఓటీటీ ద్వారా అనుష్క న‌టించిన `నిశ్శబ్దం` విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే ‘నిశ్శబ్ధం’ యూనిట్ బిగ్‌బాస్-4 హౌస్‌లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఆదివారం హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ద్వారా అనుష్క బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు ఆదివారం నాటి షోలో నాగార్జున పాల్గొనరని, అనుష్క హోస్ట్‌గా సందడి చేస్తారన్న మ‌రో ప్ర‌చారం ఊపందుకుంది. ఇదే జరిగితే బిగ్‌బాస్ చరిత్రలో సెకండ్ ఫిమేల్ హోస్ట్‌గా అనుష్క నిలిపోతుంది. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే.. మ‌రి కొన్ని గంట‌లు వెయిట్ చేయాల్సిందే.

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అనుష్క.. ఇక ర‌చ్చ ర‌చ్చే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts