కొడాలిపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..

September 22, 2020 at 11:48 am

టీటీడీ డిక్లరేషన్ వివాదంపై ఏపీ రాజకీయాల్లో రగడ నడుస్తున్న విషయం తెలిసిందే. డిక్లరేషన్ అవసరం లేదని మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, టీడీపీ నేతలు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి, కొడాలి నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో డిక్లరేషన్ విధానం ఈ నాటిది కాదని, మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం వంటి ఉన్నత వ్యకులు కూడా డిక్లరేషన్ ఇచ్చి వెంకన్నను దర్శించుకున్నారని తెలిపారు.

మంత్రి కొడాలి నాని మతి భ్రమించి మాట్లాడుతున్నారని, పేరులోనే వెంకటేశ్వరుడిని పెట్టుకుని.. వెంకన్నను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు మనోభావాలను దెబ్బ తీసేలా మాట్లాడుతున్న కోడాలి నానిపై సిఎం జగన్ చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ప్రభుత్వం స్పందించకుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలను ఉధృతం చేస్తుందని, ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హిందూత్వంపై దాడులు పెరిగాయని ఆరోపించారు. వరుస ఘటనలపై దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు మాట్లాడడంలేదని భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు.

కొడాలిపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts