సీఎంపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు…

September 9, 2020 at 3:48 pm

ఏపీ సీఎంని ఉద్దేశించి బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్వేది ఘటనను తీవ్రమైనదిగా భావిస్తున్నామని, హిందూమతాన్ని నిర్వీర్యం చేయాలన్న కుట్రలో భాగంగానే రథాన్ని కాల్చారని, అదే ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని తగులబెడితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఏపీలో హిందువులకు రక్షణ లేనట్టుగా కన్పిస్తోందని, హిందూ మతంపై దాడి చేస్తే సహించేదిలేదన్నారు.

అటు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఈ విషయంపై స్పందిస్తూ… వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని 15 దేవాలయాలపై దాడులు జరిగాయని, హిందూ ఆలయాలపై జరిగిన దాడులను ఖండిస్తున్నామని, అంతర్వేది ఘటనపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అంతర్వేది ఘటనలో నిరసనకారులపై పోలీసులు కేసులు పెట్టడం దారుణమని, హిందూ థార్మిక నాయకులను వెంటనే విడుదల చేయాలని కోరారు.

అంతకముందు అంతర్వేది వెళ్లాలని ప్రయత్నించిన సోము వీర్రాజుని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ జాతీయ పార్టీ అని, హిందుత్వం కోసం ఆలోచించే పార్టీ అని, అంతర్వేది లక్ష్మి నరసింహా స్వామి రథం కాల్చేస్తే ప్రజాస్వామ్యంలో చూడటానికి కూడా హక్కు లేదా? అని ప్రశ్నించారు. పోలీసులు హౌస్ అరెస్టు చేసిన బీజేపీ నాయకులను, కార్యకర్తలను వెంటనే విడిచిపెట్టాలన్నారు.

సీఎంపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts