రివర్స్ అయిన బీజేపీ నేతలు…కొడాలిపై తీవ్ర విమర్శలు..

September 24, 2020 at 12:17 pm

ఏపీ మంత్రి కొడాలి నాని ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మోదీ కూడా సతీసమేతంగా రాముడు గుడికి వెళ్ళారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే యూపీ సీఎం యోగిపై కూడా నాని విమర్శలు చేశారు. ఇంకా ఏపీ బీజేపీకి సోము వీర్రాజు అధ్యక్షుడు అయ్యాక రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని మాట్లాడారు. ఇక కొడాలి విమర్శలకు ఏపీ బీజేపీ నేతలు తెగ ఫైర్ అవుతున్నారు.

మంత్రి కొడాలి నాని హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం దారుణమని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు ప్రధాని మోదీ,  ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యపై మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. వారికి… కొడాలి నానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని వ్యాఖ్యానించారు.

జగన్‌కు ఏ మాత్రం గౌరవం ఉన్నా తక్షణమే మంత్రి వర్గం నుంచి కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొడాలి నాని మత్తులో ఉన్నారని..ఆ మత్తుని తమరే వదిలించాలి అంటూ జగన్‌ను కోరారు. బీజేపీ నేత సత్యమూర్తి మాట్లాడుతూ.. మంత్రి కొడాలి నాని మతి భ్రమించి, మదం ఎక్కి మాట్లాడుతున్నారన్నారు. ఇంత జరుగుతున్నా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని సత్యమూర్తి ప్రశ్నించారు. కొడాలి నానిని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

రివర్స్ అయిన బీజేపీ నేతలు…కొడాలిపై తీవ్ర విమర్శలు..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts