అధికార మదంతో నాని..జగన్‌కు బీజేపీ వార్నింగ్..  

September 21, 2020 at 10:22 am

ఏపీ మంత్రి కొడాలి నాని హిందూ దేవాలయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేస్తే, అంతర్వేది రథం తగలబెడితే, దుర్గ గుడిలో సింహాలు మాయమైతే పోయేదేమీ లేదంటూ నాని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే నాని వ్యాఖ్యలని ఏపీ బీజేపీ తీవ్రంగా ఖండించింది. అధికార మదంతో, నిలువెల్లా అహంకారంతో హిందూ దేవతలను, సంప్రదాయాలను అవమానపరుస్తూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది.

హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే వాటికి, డబ్బుతో వెలకడతావా నాని.. మరి అంతర్వేదిలో చర్చి రెండు అద్దాలు పగిలితే రూ. వెయ్యి, రెండు వేలో ఇస్తే సరిపోయేదిగా? 41 మందిపై కేసు ఎందుకు పెట్టారు? అని బీజేపీ ప్రశ్నించింది. అయితే హిందూ దేవాలయాలపై, వేంకటేశ్వర స్వామిపై పిచ్చి వాగుడును ఆపకపోతే హిందువులు మీకు తగిన బుద్ధి చెబుతారని, పరిస్థితి అంతవరకు రాకముందే సీఎం జగన్ తన మంత్రులను, పార్టీ నాయకులను కట్టడి చేస్తే మంచిది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, తస్మాత్ జాగ్రత్త అంటూ బీజేపీ వైసీపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది.

అధికార మదంతో నాని..జగన్‌కు బీజేపీ వార్నింగ్..  
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts