శ్రీ‌వారి సేవ‌లో ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రులు!

September 24, 2020 at 8:31 am

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ‌న్ ‌రెడ్డి, కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప నేటి ఉద‌యం స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన కర్ణాటక సీఎంకు, మహాద్వారం ప్రవేశ మార్గం దగ్గర ఏపీ ముఖ్యమంత్రి‌ స్వాగతం పలికారు. అనంత‌రం సీఎం జగన్‌తో కలిసి కర్ణాటక సీఎం యడియూరప్ప స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ క్ర‌మంలోనే ఇద్దరు ముఖ్యమంత్రులకు ఆలయ పండితులు ఆశీర్వచనాలు అందించి.. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం ముగించుకున్న అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, యడ్యూరప్ప ఆలయం ఎదురుగా ఉన్న నాదనీరాజనంలో నిర్వహించిన సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు.

అలాగే ఉదయం 8:10 గంటలకు కర్ణాటక సీఎంతో కలిసి సీఎం జగన్ కర్ణాటక సత్రాల భవన నిర్మాణ భూమి పూజలో పాల్గొననున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు.

శ్రీ‌వారి సేవ‌లో ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రులు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts