మూడు రాజధానులకు వ్యతిరేకమంటూ బాబుపై కాంగ్రెస్ ఫైర్…

September 23, 2020 at 3:08 pm

మొదట నుంచి ఏపీ రాజధానిపై కాంగ్రెస్ పార్టీ ఫుల్ క్లారిటీగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అమరావతినే ఏకైక రాజధానిగా కోరుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్ రాజధాని విషయంపై క్లారిటీ ఇచ్చారు.

మూడు రాజధానులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని, అమరావతిలోనే ఏపీ రాజధానిని కొనసాగించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఇచ్ఛాపురానికి, అనంతపురానికి అమరావతి సమాన దూరంలో ఉంటోందన్నారు. రాజధాని అమరావతిపై మాజీ సీఎం చంద్రబాబు తన సొంత వ్యవహారంలా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు వల్లే రాజధానికి ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ప్యాకేజీ పార్టీలని, ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోవటానికి చేతకాని జగన్ కారణమని మండిపడ్డారు.

ఇదిలా ఉంటే ఏపీకి కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని  ఏపీ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఉమెన్ చాందీ అన్నారు. ఉత్తరాఖండ్ తరహా ప్రత్యేక హోదాను ఏపీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీలో బూత్ స్థాయి నుంచి  కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తామన్నారు. త్వరలో బూత్ స్థాయి నుంచి అన్ని కమిటీలను నియమిస్తామని పేర్కొన్నారు.

 

మూడు రాజధానులకు వ్యతిరేకమంటూ బాబుపై కాంగ్రెస్ ఫైర్…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts