జగన్‌కు హైకోర్టు మరో షాక్… బాబుకు ఊరట…

September 16, 2020 at 12:21 pm

ఏపీలోని జగన్ ప్రభుత్వానికి వరుసగా హైకోర్టు షాక్‌లు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు అంశాల్లో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది హైకోర్టు. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. జగన్ అధికారంలోకి వచ్చాక గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీంటిని పునఃసమీక్షించాలంటూ సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటు చేసింది.

అలాగే రఘురామ్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన సిట్‌కు ప్రభుత్వం ప్రత్యేక అధికారాలు కట్టబెట్టింది. అయితే పోలీస్ స్టేషన్‌కు ఉన్నటువంటి అధికారాలను సిట్‌కు ఇవ్వడం న్యాయబద్దం కాదని, ఈ సిట్‌ను తక్షణం నిలుపుదల చేయాలని టీడీపీ నేతలు ఆలపాటి రాజా, వర్ల రామయ్యలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఇరువైపుల వాదనలు విన్న అనంతరం సిట్‌పై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక సిట్ విచారణకు బ్రేక్ వేయడంతో, చంద్రబాబు, టీడీపీ నేతలకు కాస్త ఊరట లభించిందనే చెప్పొచ్చు.

జగన్‌కు హైకోర్టు మరో షాక్… బాబుకు ఊరట…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts