తప్పు చేస్తే సొంత పార్టీ నేతలని కూడా వదలొద్దన్నారు…  

September 25, 2020 at 11:02 am

దేవాలయాలపై దాడులు కుట్రలో భాగంగానే జరుగుతున్నాయని ఏపీ హోమ్ మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. దళితులపై దాడులు తగ్గాయని, సీఎం వైఎస్ జగన్‌ ప్రభుత్వానికి మంచి పేరు రావటాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేస్తోందని, తప్పు చేస్తే సొంత పార్టీ నేతలనూ ఉపేక్షించొద్దని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు.

పోలీసు శాఖలో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని, ప్రతి గ్రామంలో మహిళా మిత్రలు, సచివాలయాల్లో పోలీసు కార్యదర్శులు నియామకాలు చేపట్టినట్లు వివరించారు. ఇక ఏపీ పోలీస్‌ సేవా యాప్‌’ ద్వారా ప్రజల చెంతకే పోలీసు సేవలు తీసుకువచ్చామని, ‘దిశ’ యాప్‌ను 11 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని వెల్లడించారు. విశాఖ, అమరావతి, తిరుపతి నగరాల్లో అత్యాధునిక ఫోరెన్సిక్ ఈ-ల్యాబ్ లు ఏర్పాటు చేస్తున్నామని, అత్యంత పకడ్బందీగా పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కానిస్టేబుళ్లకు రూ.40 లక్షలు, హోంగార్డులకు రూ.30 లక్షల ఉచిత బీమా అమలు చేస్తున్నామని ఆమె వెల్లడించారు.

తప్పు చేస్తే సొంత పార్టీ నేతలని కూడా వదలొద్దన్నారు…  
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts