హరీష్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రి…

September 25, 2020 at 1:42 pm

ఏపీ సీఎం జగన్‌ మాత్రం 4 వేల కోట్ల కోసం ఆశ పడి విద్యుత్‌ మీటర్లు బిగించేందుకు సిద్ధమవుతున్నారని తెలంగాణ మంత్రి హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి ఉచిత విద్యుత్‌కు మీటర్లు బిగించాలన్న జగన్‌ సర్కారు నిర్ణయం అత్యుత్యాహమేనని హరీష్‌ రావు ఆరోపించారు. ఇక హరీష్ రావుకు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

రైతులకు ఉచిత విద్యుత్ బోర్లకు మీటర్లు అమర్చే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ కష్టాల్లో ఉన్న రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వానికి మద్దతునిచ్చామని,  కేంద్రమిచ్చే రూ.4 వేల కోట్ల ఫండ్ ప్రజల అభివృద్ధికి ఉపయోగిస్తాం తప్ప అవి తమ జోబుల్లో వేసుకోమనే విషయాన్ని తెలంగాణ మంత్రి హరీష్ రావు గ్రహించాలని చెప్పుకొచ్చారు. డిస్కంలకు చెల్లించవలసిన బిల్లును నేరుగా రైతుల అకౌంట్లలో ముందుగానే జమ చేస్తున్నామని… దీనిపై ఎవ్వరూ అనుమాన పడవలసిన అవసరం లేదని చెప్పారు.

మరో 30సంవత్సరాల పాటు రైతులకు ఉచిత విద్యుత్ అందించే విషయంలో మాట తప్పమని రైతులకు హామీ ఇస్తున్నామని, రైతులకు అందించే ఉచిత విద్యుత్ విషయంలో రాజీపడమని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలా కేంద్రంతో ఒకరోజు మంచిగా ఉండటం మరో రోజు గొడవ పడటం కాకుండా రాష్ట్ర అభివృద్ధికోసం దీర్ఘకాలిక సఖ్యత అవసరమని చెప్పారు.

హరీష్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రి…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts