ఏపీలో కరోనా.. ప్రజలకు మళ్లీ నిరాశే.. ఈ రోజు ఎన్నంటే..?

September 22, 2020 at 7:04 pm

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఒకరోజు తగ్గుముఖం పట్టినట్లు అనిపిస్తుంది మరో రోజు ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అయితే గతంతో పోలిస్తే కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ నిన్న మొన్నటి తో పోలిస్తే మళ్ళీ కేసులు పెరిగాయి అని చెప్పాలి. ఇటీవలే గత ఇరవై నాలుగు గంటలకు సంబంధించిన కరోనా బులిటెన్ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది.

గత 24 గంటల్లోఏపీలో కరోనా 7,553 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ కాగా 51 మంది మృతిచెందారు. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,39,302కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5,461కి చేరింది. ఒక్కరోజులో 10,555 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 71,465 యాక్టివ్‌ కేసులున్నాయి.

ఏపీలో కరోనా.. ప్రజలకు మళ్లీ నిరాశే.. ఈ రోజు ఎన్నంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts