ఏపీలో మళ్లీ స్కూళ్ల ప్రారంభం వాయిదా..?

September 29, 2020 at 4:28 pm

కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యాసంస్థల పునః ప్రారంభానికి అనుమతి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలో ప్రారంభానికి తీవ్ర కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 5న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలను తెరవాలి అన్న నిర్ణయానికి వచ్చింది ఏపీ ప్రభుత్వం. అయితే పాఠశాలను తెరవాలని అన్న నిర్ణయం తీసుకున్నప్పటికీ.. కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం మాత్రం ఎక్కడా తగ్గకపోవడంతో మరోసారి వెనకడుగు వేసింది.

దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం మరోసారి వాయిదా పడింది అని చెప్పాలి. అక్టోబర్ 5న స్కూళ్లను పునః ప్రారంభించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుని నవంబర్ 2న పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే అక్టోబర్ 5న జగనన్న విద్యా కానుక ఈ పథకాన్ని ప్రారంభించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఏదైనా స్కూల్ కి వెళ్లి ముఖ్యమంత్రి జగన్ ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఏపీలో మళ్లీ స్కూళ్ల ప్రారంభం వాయిదా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts