వెలుగులోకి ఆదిమాన‌వుల పాద‌ముద్ర‌లు.. ఎక్క‌డో తెలుసా..?‌

September 18, 2020 at 10:47 am

ఈ భూ ప్ర‌పంచం మీద జీవుల పుట్టుక ఎన్నో ఏళ్ల‌క్రిత‌మే ఏర్ప‌డింది. అనేక జీవ‌రాశులు పుడుతూనే ఉన్నాయి. మారుతున్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను త‌ట్టుకొని నిల‌బ‌డ‌లేక కొన్ని కాల‌గ‌ర్భంలో క‌లిసిపోతున్నాయి. మ‌రికొన్ని జీవ‌రాశులు త‌మ శారీర‌క, జీవ‌న విధానంలో మార్పులు చేసుకుని మ‌నుగ‌డ‌ను సాగిస్తున్నాయి. ఈ అంశాల‌న్నింటిని ఎలా తెలుసుకుంటారు అంటే శిలాజాల ఆధారంగానే. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇలాంటి శిలాజ ఆన‌వాళ్లు ఎన్నో బ‌య‌ట‌ప‌డ్డాయి.

ఇక తాజాగా సౌదీ అరేబియాలో 1.2 లక్షల సంవత్సరాల నాటి మనుషుల, జంతువుల పాదముద్రలు బ‌య‌ట్ట‌ప‌డ్డాయి. సౌదీ అరేబియాకు చెందిన హెరిటేజ్ కమిషన్ ఆ వివ‌రాల‌ను ప్ర‌క‌టించింది. అరేబియన్ ద్వీపకల్పంలో శాస్త్రీయ ఆధారాలతో పురాతనమైన నివాసాన్ని కనుగొన‌డం ఇదే మొదటిసారి అని ఆర్కియాలజిస్ట్‌లు చెబుతుండ‌డం విశేషం. తాబుక్ రీజియన్ పరిసర ప్రాంతాల్లో అతిపురాతనమైన సరస్సు దగ్గర జరిపిన పరిశోధనల్లో భాగంగా ఈ పాదముద్రలను గుర్తించిన‌ట్లు ఆర్కియాలజిస్ట్‌లు వెల్ల‌డించారు. పాదముద్రలతో పాటు దాదాపు 233 ఏనుగుల శిలాజాలు, ఆరిక్స్ అనే జంతువు ఎముకలు కూడా లభ్యమైన‌ట్లు ఆర్కియాల‌జిస్టులు తెలిపారు.

వెలుగులోకి ఆదిమాన‌వుల పాద‌ముద్ర‌లు.. ఎక్క‌డో తెలుసా..?‌
0 votes, 0.00 avg. rating (0% score)