మాస్కు వాడుతున్నారా..? జర జాగ్రత్త…!

September 27, 2020 at 6:02 pm

కరోనా వచ్చిన ప్రారంభంలో అనేక మంది వాడి పడేసే మాస్కులను వాడేవారు. అయితే ప్రస్తుతం క్లాత్ మాస్కులు, తిరిగి వినియోగించగల మాస్కుల వినియోగం బాగా పెరిగింది. దీంతో అనేక మంది మాస్కులను శుభ్రం చేసుకోకుండా రోజుల కొద్దీ వాడుతున్నారు. దీంతో అలాంటి మాస్కులు బ్యాక్టీరియా, సూక్ష్మజీవులకు నిలయాలుగా మారుతున్నాయి. దీంతో గొంతు ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, డస్టు ఎలర్జీ అధికంగా ఉన్నవారు ఇలాంటి ఇన్ఫెక్షన్లకు త్వరగా గురయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా మాస్కు ధరించినప్పుడు మనం మాట్లాడే మాటలు అవతల వారికి వినపడడం కోసం గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. దీంతో గొంతుపై ఒత్తడి పెరిగి సైతం ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది.

మాస్కు వాడే వారు ఇలాంటి ఇన్ఫెక్షన్లకు గురి కాకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మాస్కును ఎప్పటికప్పుడు ఉతికి శుభ్రం చేసుకోవడం ద్వారా గొంతు ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మాస్కు వాడడమే కాదు దాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమని వారు చెబుతున్నారు. ఎప్పుడు ఒక మాస్కునే వాడకుండా.. రెండు మాస్కులను దగ్గర ఉంచుకుని తరచుగా వాటిని మార్చడం కూడా మంచిది. మాస్కులను తరచుగా చేతులతో ముట్టుకోవడం అస్సలు చేయకూడదు. మాస్కులను పెట్టకునే ముందు, పెట్టకున్న తర్వాత చేతులను కడుక్కోవడం ద్వారా ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుకోవచ్చు.

మాస్కు వాడుతున్నారా..? జర జాగ్రత్త…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts