అస్సలు వదిపెట్టను.. పోరాటం చేస్తా : టాలీవుడ్ హీరో

September 21, 2020 at 6:44 pm

ప్రస్తుతం కరోనా సంక్షోభం సమయంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఆన్లైన్ క్లాసుల పేరుతో అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు అంటూ ఎవరూ ఊహించని విధంగా సినీ హీరో శివబాలాజీ న్యాయపోరాటానికి దిగటం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. శివబాలాజీ న్యాయపోరాటానికి కొంత మంది మద్దతు ప్రకటిస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక తాజాగా దీనిపై స్పందించిన శివబాలాజీ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మణికొండలోని మౌంట్ లిటేర జీ స్కూల్ యాజమాన్యాన్ని వదిలే ప్రసక్తే లేదు అంటూ శివబాలాజీ వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఇప్పటికే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు అంటూ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించిన శివ బాలాజీ… ఇటీవలే రంగారెడ్డి డీఈవో ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అక్రమ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు స్కూల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేట్ స్కూల్ల పై పోరాటం చేస్తుంటే తనను రెచ్చగొట్టే విధంగా ఆరోపణలు చేయడం సరికాదంటూ సూచించారు శివ బాలాజీ.

అస్సలు వదిపెట్టను.. పోరాటం చేస్తా : టాలీవుడ్ హీరో
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts