ఉద్యోగం కోసం ఇంటిపెద్ద ఉసురు తీశారు..

September 21, 2020 at 7:38 pm

స‌మాజంలో మాన‌వీయ, నైతిక విలువ‌లు కనుమ‌రుగ‌వుతున్నాయి. స్వార్థ చింత‌న పెరిగిపోతున్న‌ది. డ‌బ్బు కోసం ఎంత‌టి అఘాయిత్యాల‌కైనా పాల్ప‌డుతున్నారు కొంద‌రు మూర్ఘులు. అయిన‌వార‌ని కూడా చూడ‌కుండా ప్రాణాల‌నే బ‌లిగొంటున్నారు. అందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌.
ఉద్యోగం కోసం కుటంబ పెద్దను హత్య చేశారు. ఆపై దానిని ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించేందుకు ప్ర‌య‌త్నించినా విఫ‌ల‌మైంది ఆ కుటుంబం. చివ‌ర‌కు క‌ట‌క‌టాలను లెక్క‌ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. ఈ అమాన‌వీయ‌క‌ర‌మైన సంఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం..

బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన ముత్తె శంకర్ (55) సింగరేణి కార్మికుడు. ఆయ‌న‌ ఈ నెల 5 తేదీన అర్ధరాత్రి మృతిచెందారు. శంక‌రే ఆత్మ‌హ‌త్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. శంక‌ర్‌ మృతిపై అనుమానం వ‌చ్చిన అత‌ని సోద‌రి నేరుగా పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో హ‌త్య కోణంలో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎట్ట‌కేల‌కు మ‌ర్డ‌ర్ మిస్ట‌రీని చేధించారు. శంకర్‌కు భార్య విజయ, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు శ్రావణ్ ఉన్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో రెండేళ్లుగా మంచిర్యాలలొనే శంక‌ర్ ఒంట‌రిగా నివాసముంటున్నాడు. ఈ క్ర‌మంలో కూతురు స్వాతికి కరోనా వచ్చిందని ఆరోగ్యం బాగా లేదని కబురు రావడంతో చూసేందుకు బెల్లంప‌ల్లి వెళ్లాడు. అయితే అక్క‌డ భార్య భర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న‌ది. ఈ నేప‌థ్యంలో పథకం ప్రకారం నిద్రిస్తున్న శంకర్ మెడకు బెల్ట్ తో ఉరివేసి హ‌త్య చేశారు. త‌రువాత చీరతో శంక‌ర్ ఉరివేసుకున్నాడ‌ని న‌మ్మించేందుకు కుటుంబ స‌భ్యులు ప్ర‌య‌త్నం చేశారు. పోలీసుల రంగ ప్ర‌వేశంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఉద్యోగం కోసం కుమారుడే మిగ‌తా కుటుంబ స‌భ్యులు, మరొక వ్యక్తి సహకారంతో హ‌త్య చేయ‌డం విచార‌కరం. ప్రస్తుతం పరారీలో ఉన్న మ‌రో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేప‌ట్టారు. హత్యకు ఉపయోగించిన బెల్ట్,మరియు సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఉద్యోగం కోసం ఇంటిపెద్ద ఉసురు తీశారు..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts