ఛీ.. ఉదయాన్నే పార్లమెంట్ లో మొదలు పెట్టేశారు..!

September 22, 2020 at 10:36 am
రాజ్యసభలో 8 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటును ఎత్తివేయాలని కాంగ్రెస్​ డిమాండ్ చేసింది. కనీస మద్దతు ధరకు సంబంధించి మరో బిల్లు తీసుకురావాలని ఆ పార్టీ నేత గులాం నబీ ఆజాద్​ స్పష్టం చేశారు. లేకపోతే పార్లమెంటు సమావేశాలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. వ్యవసాయ బిల్లుల విషయంలో విపక్ష సభ్యులు అనుచితంగా ప్రవర్తించారంటూ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ ఒకరోజు నిరాహార దీక్షకు దిగారు.
ఆదివారం రాజ్యసభలో చోటుచేసుకున్న గందరగోళ పరిస్థితుల పట్ల ఛైర్మన్‌ ఎం.వెంకయ్య నాయుడు అంతకుముందు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  8 మంది విపక్ష ఎంపీలను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. బిల్లుల్ని నిబంధనలకు విరుద్ధంగా ఆమోదింపజేశారంటూ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌‌ సింగ్‌పై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస నోటీసును వెంకయ్య తిరస్కరించారు. సభా నియమాల ప్రకారం డిప్యూటీ ఛైర్మన్‌పై అవిశ్వాసం ఆమోదనీయం కాదన్నారు. ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు సహా 8 మంది రాజ్యసభ సభ్యులను సస్పెండ్​ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. ఈ మేరకు అమెరికా నుంచి కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ స్పందించారు.
ఛీ.. ఉదయాన్నే పార్లమెంట్ లో మొదలు పెట్టేశారు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts