అతనికి మూడు ఓట్లు కూడా రావు.. రఘురామ సంచలన వ్యాఖ్యలు..!

September 15, 2020 at 2:55 pm

వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిన రఘురామకృష్ణంరాజు తాజాగా వైసీపీ పార్లమెంటరీ నేత అయిన మిథున్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన రఘురామకృష్ణంరాజు… మా పార్లమెంటరీ నాయకుడు మిథున్ రెడ్డి ఎప్పుడైనా రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో గళం వినిపించారా అంటూ ప్రశ్నించారు. ఒక ప్రత్యేక హోదా మినహా మిగతా ఏ సమస్యలను కూడా పార్లమెంటులో ప్రస్తావించలేదు అంటూ విమర్శించారు.

ఒకవేళ వైసీపీలో పార్లమెంటరీ నాయకుడికి ఎన్నికలకు పెడితే మిథున్ రెడ్డికి కనీసం రెండు మూడు ఓట్లు కూడా రావు అంటూ విమర్శలు గుప్పించారు రఘురామకృష్ణంరాజు. ఇలాంటి ఎన్నికలు పెడితే అన్ని ఓట్లు తనకే వస్తాయని ధీమా వ్యక్తం చేశాడు. అయితే పార్టీ అంటే కులం మతం కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రఘురామ. కాగా ఓ వైపు ముఖ్యమంత్రికి కుల మత పట్టింపులు లేవు అని చెబుతూనే మరోవైపు… పార్టీని అనాల్సిన మాటలు అన్ని అనేసారు రఘురామకృష్ణంరాజు.

అతనికి మూడు ఓట్లు కూడా రావు.. రఘురామ సంచలన వ్యాఖ్యలు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts