పోలీసులు రేప్ చేశారంటూ డ్రామా.. చివ‌ర‌కు ఏమైందంటే..

September 28, 2020 at 9:44 am

పోలీసుల‌తో పాటు మ‌రికొంద‌రు త‌న‌పై అత్యాచారం చేశారంటూ ఓ మ‌హిళా నాట‌కానికి తెర‌లేపింది. ఈ మేర‌కు ఏకంగా కోర్టును ఆశ్ర‌యించింది. అయితే ఇవేవీ తెలియ‌న న్యాయ‌స్థానం ఆ ఫిర్యాదు న‌మోదు చేసుకుని విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారుల‌కు అస‌లు నిజాలు వెలుగుచూశాయి. మ‌హిళాపై ఎవ‌రూ రేప్ చేయ‌లేద‌ని, అంతా నాట‌క‌మ‌ని తేల్చారు. ఈ నేప‌త్యంలో ఆమెపై కేసు న‌మోదు చేసి రిమాండ్ కు త‌ర‌లించారు. ఈ సంఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్లితే.. మహారాష్ట్ర రాజధాని ముంబై‌కు చెందిన ఓ 35 ఏళ్ల మహిళ తనను ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు, ఒక ఆటో రిక్షా డ్రైవర్ రేప్ చేశారంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. జవనవరి 11న మానవ అక్రమ రవాణా కేసుకు సంబంధించిన విచారణ పేరిట తనపై అత్యాచారం చేశార‌ని, అలాగే 11 ఏళ్ల తన కూతురిని కూడా వేధించారని చెప్పుకొచ్చింది. పోలీసుల‌ దాడి వల్ల త‌న‌కు గర్భస్రావం కూడా అయింద‌ని కోర్టు ఎదుట విల‌పించింది.

దీనిపై స్పందించిన హైకోర్టు వెంట‌నే మహిళ ఫిర్యాదు‌పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కేసు విచార‌ణ‌కు ప్రత్యే క దర్యాప్తు బ‌ృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేప‌త్యంలో గత నెలలో పోలీసులు.. ఇద్దరు కానిస్టేబుల్స్ శిశుపాల్ జగ్దానే, గవ్హానే ఆటో రిక్షా డ్రైవర్‌ను ఘరేను అధికారులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూశాయి. ఈ ఘటన జరిగిన సమయంలో శిశుపాల్ ఉత్తరప్రదేశ్‌లో, గవ్హనే ఠాణా‌లో, ఆటో డ్రైవర్ సాకినాకలోని తన ఇంట్లో ఉన్నాడని నిర్ధారించారు. పోలీసుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు డ్రామాలాడిన‌ ఆ మహిళపై సెక్షన్ 120 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు త‌ర‌లించారు. ఇదిలా ఉండ‌గా.. ఆ మహిళ తప్పుడు కేసు ఫైల్ చేసేందుకు సహకరించ‌డంలో ఓ పోలీస్‌పై కూడా కేసు నమోదు చేయ‌డం కొస‌మెరుపు.

పోలీసులు రేప్ చేశారంటూ డ్రామా.. చివ‌ర‌కు ఏమైందంటే..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts