వేరే దారి లేక బాబు ఇలా చేస్తున్నారు…

September 26, 2020 at 1:45 pm

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాలయాలపై దాడులు మతమార్పిడి కోసమని చంద్రబాబు అర్థం పర్ధం లేకుండా మాట్లాడుతున్నారని, దేవాలయాలపై దాడులు చేసి వారిని వదిలి పెట్టేది లేదు’ అంటూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

చంద్రబాబు తన రాజకీయం కోసం ఎంతకైనా దిగజరుతాడని, ఆయన కుల రాజకీయాలను ప్రజలు నమ్మలేదని, దీంతో చంద్రబాబుకు వేరే దారిలేక ఇప్పుడు మతంతో రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు డిక్లరేషన్‌ను వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. అటు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ కూడా బాబుపై మండిపడ్డారు. కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని సందేహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే సహించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

 

వేరే దారి లేక బాబు ఇలా చేస్తున్నారు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts