రెండు రొట్టెలతో నెలకు రూ.70వేలు సంపాదన.. ఎలాగంటే?

September 16, 2020 at 8:37 am

రెండు రొట్టెలతో నెలకు రూ.70వేలు సంపాదన.. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. హర్యాణాలోని నౌరంగాబాద్‌ అనే చిన్న గ్రామంలో బబితా అనే యువ‌తి ఇంటికి కోడలుగా వచ్చింది. ఆమె వంట బాగా చేస్తుంది. ఆమె వంట‌లు రుచిగా, అందంగా చేయ‌డంలో ఎక్స్పర్ట్. ఇది తెలుసుకున్న మరది రంజిత్‌.. బ‌బితా వంట చేస్తుంటే వీడియో షూట్ చేసి యూట్యూబ్‌లో పెట్టాల‌ని భావించాడు. అయితే త‌న ద‌గ్గ‌క కేవ‌లం ప‌ది వేల రూపాయల మామూలు ఫోన్‌ ఉంది.

అయిన‌ప్ప‌టికీ అదే ఫోన్‌లో`ఇండియన్‌ గర్ల్‌ బబితాస్‌ విలేజ్` పేరుతో 2017లో ఛానెల్ ఓపెన్ చేసి.. మొదటగా వదిన చేత `పిండి బాగా కలపడం ఎలా` అనే వీడియో చేపించి అప్లోడ్ చేశారు. అయితే ఈ వీడియోకు పెద్ద వ్యూస్ రాలేదు. అయితే ఈ సారి.. ఒక ఎడిటింగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని మృదువైన రొట్టెలు తయారు చేయడం ఎలా అని వదినతో వీడియో చేశాడు. ఈ సారి అనూహ్యంగా రెండు రోజుల్లోనే పది లక్షల వ్యూస్‌ వచ్చాయి. అప్ప‌టి నుంచి వారి ప్ర‌యాణం ప్రారంభ‌మైంది. నెలకు నాలుగైదు వంటలు చేసి వదిన, మరిది అప్‌లోడ్ చేసేవారు.

తల మీద ఘూంఘట్‌ను ఉంచుకునే చకచకా వంట చేసే బబితా చేతి నైపుణ్యాన్ని మ‌రియు కట్టెల పొయ్యి, కిరోసిన్‌ స్టవ్, అలికిన పరిసరాలు బాగా ఆక‌ట్టుకున్నాయి. ఇక ఛానెల్ మొద‌లైన ఆరు నెల‌ల్లోనే యూట్యూబ్‌ ఆ చానెల్‌ను మానిటైజ్‌ చేయడం మొదలెట్టింది. బబిత అకౌంట్‌లో డబ్బు పడటం స్టార్ట్ అయ్యింది. ఇక వీరి తొలి పారితోషికంగా రూ.13వేల 400 పడ్డాయి. దీంతో వారి ఆనందానికి అవ‌దులు లేకుండా పోయాయి. ఇక ఆ త‌ర్వాత వీరికి నాలుగున్న‌ర ల‌క్ష‌ల సబ్‌స్క్రయిబర్స్ రావ‌డంతో పాటు భారీ వ్యూస్ కూడా వ‌చ్చేవి. ఈ క్ర‌మంలోనే వారికి యావరేజ్‌గా ఇప్పటికి వారికు నెలకు 60, 70 వేలు వస్తున్న‌ట్టు తెలుస్తోంది.

రెండు రొట్టెలతో నెలకు రూ.70వేలు సంపాదన.. ఎలాగంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts