28ఏళ్ల త‌రువాత బాబ్రీపై సీబీఐ కోర్టు కీల‌క తీర్పు

September 30, 2020 at 12:56 pm

ఎట్ట‌కేల‌కు బాబ్రీ మ‌సీదు కూల్చివేత ఘ‌ట‌న‌పై ల‌క్నో సీబీఐ ప్ర‌త్యేక కోర్టు త‌న తీర్పును వెలువ‌రించింది. ఆ ఘ‌ట‌న ముంద‌స్తు ప‌థ‌కం ప్ర‌కారం జ‌రిగింది కాద‌నీ స్ప‌ష్టం చేయ‌డంతో పాటు, కేసులో ప్ర‌ధాన నిందితులుగా ఉన్న అధ్వానీ, ఉమాభార‌తి, ముర‌ళీ మ‌నోహ‌ర్‌జోషి త‌దిత‌ర మొత్తం 49 మందిని నిర్దోషులుగా ప్ర‌క‌టించారు జ‌డ్జి సురేంద్ర‌కుమార్ యాద‌వ్‌. అదీగాక బాబ్రీ మ‌సీదు కూల్చివేత‌ను అడ్డుకునేందుకు వీహెచ్‌పీ, భ‌జ‌రంగ్‌ద‌ళ్ నేత‌లు ఎంతో కృషి చేశార‌ని తెల‌ప‌డం గ‌మ‌నార్హం.

1992లో ఎల్‌కే అధ్వానీ నేత‌త్వంలో ర‌థ‌యాత్ర‌ను చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఉత్త‌‌ర‌ప్రదేశ్ అయోధ్య స‌మీపంలోని బాబ్రీ మ‌సీదును క‌ర‌సేవ‌కులు దానిని కూల్చివేశారు. ఈ ఘ‌ట‌న అనంత‌రం దేశ‌వ్యాప్తంగా అనేక మ‌త‌సంఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఈ కేసు విచార‌ణ‌కు అప్ప‌టి ప్ర‌భుత్వం జ‌స్టీస్ లిబ‌ర్హాన్ క‌మిష‌న్‌ను నియ‌మించింది. సుదీర్ఘ‌కాలం విచార‌ణ అనంత‌రం అది నివేదిక‌ను స‌మ‌ర్పించింది. ఆ క‌మిటీ నివేదిక‌పై ల‌క్నో సీబీఐ కోర్టు ప్ర‌త్యేక విచార‌ణ కొన‌సాగింది. తుద‌కు 28 ఏళ్ల త‌రువాత ఇప్పుడు తీర్పును వెలువ‌రించ‌డం గ‌మ‌నార్హం. నిందితుల‌పై కేసును కొట్టేసింది. త‌న ఉద్యోగ విర‌మ‌ణ తీసుకోనున్న రోజునే జ‌డ్జీ సురేంద్ర‌కుమార్ యాద‌వ్ 2వేల పేజీలతీర్పు కాపీని వెలువ‌రించారు.అధ్వానీ, ఉమాభార‌తి, ముర‌ళీమ‌నోహ‌ర్ జోషి, విన‌య్ క‌ట్ట‌యార్ తో పాటు మొత్తం 49 మందిని నిర్దోషుల‌కు ప్ర‌క‌టించారు. కేసు విచార‌ణ‌లో ఉండ‌గానే 17 మంది నిందితులు మృతి చెందారు. ‌

28ఏళ్ల త‌రువాత బాబ్రీపై సీబీఐ కోర్టు కీల‌క తీర్పు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts