బాబ్రీ మసీదు తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా ఉంది..?

September 30, 2020 at 6:47 pm

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు గత 28 సంవత్సరాల నుంచి కోర్టులో వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కూడా చేస్తుంది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎంతోమంది ప్రముఖులు నిందితులుగా ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఏళ్లనుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ కేసులో ఇటీవలే ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మసీదు కూల్చివేత కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు అందరిని నిర్దోషులుగా తేలుస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. కేవలం ఆడియో వీడియో ఆధారంగానే నిందితులను దోషులుగా తేల్చలేము అని కోర్టు స్పష్టం చేయగా.. 2000పేజీల తీర్పును చదివి వినిపించారు న్యాయమూర్తి ఎస్కె యాదవ్.

తాజాగా దీనిపై స్పందించిన కాంగ్రెస్ అధిష్టానం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత పై న్యాయ స్థానం ఇచ్చిన తీర్పు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్. మసీదు కూల్చివేత చట్ట వ్యతిరేకం అంటూ వ్యాఖ్యానించిన ఆయన… ఈ తీర్పు విషయంలో న్యాయస్థానం అసాధారణమైన ఉల్లంఘనకు గురి అయింది అంటూ వ్యాఖ్యానించారు. కాగా ప్రస్తుతం కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిపోయాయి.

బాబ్రీ మసీదు తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా ఉంది..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts