బాలసుబ్రమణ్యం తొలి గురువు ఆయనే..?

September 25, 2020 at 3:59 pm

ఒక సాధారణ గాయకుడిగా ప్రస్థానం ప్రారంభించి.. భారతీయ సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించి గాన గాంధర్వుడుగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆకస్మిక మరణం ప్రస్తుతం అభిమానులందరినీ విషాదంలోకి నెట్టింది. కేవలం ఒక గాయకుడు గానే కాకుండా దర్శకుడిగా నటుడిగా ఆయన ప్రస్థానం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంత అద్భుతంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలు ఎన్నో షోల ద్వారా ఎంతో మంది ప్రతిభగల గాయకులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు.

అయితే బాలు గాయకుడు కావాలి అనే కోరికకు బీజం పడింది చిన్నప్పుడేనట. నెల్లూరు జిల్లా కోనెటమ్మ పేటకు చెందిన ఎస్పీ బాలసుబ్రమణ్యం చిన్నప్పటినుంచే సంగీతంపైనా ఎంతో ఆసక్తి కలిగి ఉండే వాడట. దీనికి కారణం బాలు తండ్రి సాంబమూర్తి హరికథ భక్తిరస నాటకాలలో పాల్గొనడంతో… తండ్రిని చూస్తూ చూస్తూ బాలు కి కూడా సంగీతంపై ఆసక్తి పెరిగింది. ఐదేళ్ల వయస్సున్న అప్పటినుంచి తన తండ్రి దగ్గర సంగీతంలో ఎన్నో మెళకువలు నేర్చుకుంటూ… నాటకాలలో కూడా తన గాత్రంతో అందరినీ మెప్పించేవాడట బాలసుబ్రమణ్యం.

బాలసుబ్రమణ్యం తొలి గురువు ఆయనే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts