బాలు మృతిపై వెంకయ్యనాయుడు బావోద్వేగం..?

September 25, 2020 at 4:07 pm

బాలు మృతితో భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయింది. ఇటీవలే కరోనా వైరస్ నుంచి జయించి మృత్యుంజయుడు గా అందరిని తన గాత్రంతో మరిపించడానికి బాలు వచ్చాడు అని అనుకుంటున్న తరుణంలోనే ఆరోగ్యం విషమించి ఆసుపత్రిలో చేరడం అంతలోనే ప్రాణాలు వదలడం అభిమానులను విషాదంలోకి నెట్టింది. బాలు మృతి పట్ల ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

ఇక బాలుడు మృతి పై స్పందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒక ఎమోషనల్ ట్విట్ పెట్టారు. బాలు ఆస్పత్రి నుంచి కోరుకుంటున్నారు అని సంతోషపడేలోపే మళ్లీ ఇలాంటి చేదు వార్త వినడం తనకెంతో బాధ కలిగించిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన గాత్రంతో ప్రజలందరినీ అలరింప చేసిన పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యంతో పరమపదించడం బాధాకరం అంటూ తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. బాలు తో తనకు చిన్నప్పటి నుంచీ పరిచయం ఉందని.. గుర్తు చేసుకున్న వెంకయ్యనాయుడు బాలుడు మృతి పై ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

బాలు మృతిపై వెంకయ్యనాయుడు బావోద్వేగం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts