ఏపీ మందుబాబుల‌కు మ‌రో అదిరిపోయే గుడ్‌న్యూస్‌!

September 19, 2020 at 7:32 am

క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు అన్ని రంగాలు కుదేల్ అయిన సంగ‌తి తెలిసిందే. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని వ్యాపారాల‌పై క‌రోనా భారీగా దెబ్బ కొట్టింది. అయితే ఇటీవ‌ల కేంద్రం అనుమ‌తుల‌తో మ‌ళ్లీ వ్యాపార‌ల‌న్నీ మెల్ల మెల్ల‌గా ప్రారంభం అవుతున్నాయి. అయితే తాజాగా మందుబాబుల‌కు ఏపీలో స‌ర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది.

రాష్ట్రంలో గత కొంతకాలంగా బార్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ సర్కారు బార్ల లైసెన్సులు కొనసాగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నేటి(19వ తేదీ) నుంచి బార్లను తెరుచుకోన్నాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 840 బార్ల లైసెన్స్‌లను 2021 జూన్ 30 వరకు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్న సర్కార్.. వాటిపై 20 శాతం కోవిడ్ ఫీజు, 10 శాతం అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాదు, బార్లలో మద్యం విక్రయాలపై 10 శాతం రిటైల్ పన్ను వసూలు చేయనున్నారు.

ఏపీ మందుబాబుల‌కు మ‌రో అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts