పిల్లలు పుట్టకముందే.. లింగ నిర్ధారణ.. తరువాత ఏమైందంటే..?

September 11, 2020 at 4:12 pm

అన్ని దేశాలు ఇప్పుడు దుబాయ్ వైపు చూస్తున్నాయి. పర్యాటక రంగంలో దేశం అత్యధిక వేగంతో ముందుకు దూసుకుపోతుంది. ఇప్పుడు ఆ దేశంలో ఓ సరదా సంఘటన చోటు చేసుకుంది. అది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తుంది.దుబాయ్‌లో ఉండే అనాస్, ఆస్లా మర్వాహ్‌లకు సంబంధించిందీ వీడియో. ఈ వీడియో ద్వారా ఈ దంపతులు తమకు పుట్టబోయే బిడ్డకు సంబంధించి లింగ నిర్ధారణ చేసి దాని ఫలితం బంధువులకు తెలియజేశారు. కానీ అది అత్యంత అంగరంగ వైభవంగా బాధితులు చెప్పారు. లింగ నిర్ధారణ దుబాయి లో అత్యంత సర్వసాధారణం. అందుకే వీరు ఎంతో ఆర్భాటంగా చేసుకుంటున్నారు.

తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మిత్రులను బుర్జ్ ఖలీఫా ఆవరణ వద్దకు పిలిపించి ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేశారు.బుర్జ్ ఖలీఫాపై లేజర్ షో నిర్వహించారు.అక్కడికి వచ్చిన అతిథుల మధ్య మగ బిడ్డ అని బహిర్గతం చేశారు.దీంతో పార్టీకి వచ్చినవారు కేరింతలు కొట్టారు అది ఆ వీడియోలో ఉంది.ఈ వీడియో ఇన్‌స్టాగ్రాంలో 1.7 మిలియన్ వ్యూస్, 5.7 లక్షల లైక్స్ సొంతం చేసుకుంది. వీడియో చూసిన నెటిజన్లు అనాస్, ఆస్లా దంపతులకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా, బుర్జ్ ఖలీఫాపై ఈ లేజర్ షో కోసం దంపతులు ఏకంగా రూ. 75 లక్షలు ఖర్చు చేశారు.

 

పిల్లలు పుట్టకముందే.. లింగ నిర్ధారణ.. తరువాత ఏమైందంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts