ఎవ‌రైనా స‌రే అమితాబ్‌కు హ‌లో చెప్ప‌వ‌చ్చు.. ఎలాగంటే..!

September 15, 2020 at 8:28 am

బిగ్‌బీ అమితాబ్‌కు హాలో చెప్ప‌వ‌చ్చు. జోక్స్ చెప్పుకోవ‌చ్చు, వార్త‌ల‌ను చెప్ప‌వ‌చ్చు. స‌ల‌హాలు కూడా ఇవ్వ‌వ‌చ్చు. అదేంటి బిగ్ బీ ఏంటి మ‌న‌తో మాట్లాడ‌డ‌మేంటి అనుకుంటున్నారా? ఇది అంతా ఫేక్ అని అపోహ ప‌డుతున్నారా? నేను చెప్పిందంతా నిజ‌మే. కాక‌పోతే ఒక చిన్న ష‌ర‌తు ఉంది ఇక్క‌డ‌, అమితాబ్‌తో మాట్లాడాల‌నుకునేవారు అమెజాన్ అలెక్సాను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఎంచ‌క్క మాట్లాడే అరుద‌యిన అవ‌కాశాన్ని పొంద‌వ‌చ్చు. ఎలాగంటే.. అమెజాన్ అలెక్సా అమితాబ్ ను వ‌ర్చువ‌ల్ అసిస్టెంట్ గా నియ‌మించుకున్న‌ది. ఈ మేర‌కు అమెజాన్ తాజాగా ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

ఫైర్ టీవీ, అలెక్సా యాప్, అమెజాన్ షాపింగ్ (ఆండ్రాయిడ్‌), అలెక్సా ఎఖో డివైస్ ల‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ తో మాట్లాడొచ్చు. క‌స్ట‌మ‌ర్ల‌కు అద్బుత‌మైన వాయిస్ ఎక్స్‌పీరియ‌న్స్ ను ఇచ్చేందుకే బ‌చ్చ‌న్ తో క‌లిసి ప‌నిచేస్తున్నామ‌ని అమెజాన్ తెలిపింది. అలెక్సా కోసం వాయిస్ ఇస్తున్న తొలి సెల‌బ్రిటీగా అమితాబ్ బచ్చ‌న్ నిలిచార‌ని వెల్ల‌డించింది. ఇక అమితాబ్ తో మాట్లాడే అవ‌కాశం వ‌చ్చే ఏడాది అందుబాటులోకి రానుంది. కొత్త త‌ర‌హా ఆలోచ‌న‌ల‌ను తీసుకునేందుకు టెక్నాల‌జీ ఎప్పుడూ నాకు అవ‌కాశం ఇచ్చింది. సినిమాలు, దీనిపై బిగ్ బీ సైతం స్పంఇంచారు. టీవీ షోలు, ఇత‌ర కార్య‌క్ర‌మాలు. అమెజాన్‌, అలెక్సాతో భాగ‌స్వామ్య‌మై నా గొంతు అందించ‌డం చాలా ఎక్సయిటింగ్ గా ఉంద‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. వాయిస్ టెక్నాల‌జీతో నా అభిమానులు, శ్రేయోభిలాషులతో మ‌రింత బాగా క‌నెక్ట్ అయ్యే అవ‌కాశ‌ముంటుంద‌ని బ‌చ్చ‌న్ వివ‌రించారు.

ఎవ‌రైనా స‌రే అమితాబ్‌కు హ‌లో చెప్ప‌వ‌చ్చు.. ఎలాగంటే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts