బిగ్‌బాస్ కంటెస్టెంట్ సూర్య కిరణ్‌, నాగార్జున మ‌ధ్య‌ రిలేష‌న్ ఏంటో తెలుసా?

September 15, 2020 at 8:23 am

వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 ఇటీవ‌ల ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం బిగ్ బాస్ ఇంటి స‌భ్యులు తొలి వారం పూర్తి చేసుకుని.. రెండో వారంలోకి అడుగుపెట్టారు. ఇక తొలివారం నామినేషన్‌కి సంబంధించి ఏడుగురు నామినేట్ కాగా.. గంగవ్వ, అభిజిత్, సుజాత, మొహబూబ్‌, దివి, అఖిల్ సార్ధక్ సేఫ్ అయ్యారు. సూర్య కిర‌ణ్ ఫ‌స్ట్ ఎలిమినేట్ అయ్యి.. ఇంటి ముఖం పట్టారు.

అయితే తొలి వారం ఎలిమినేట్ అయిన సూర్య కిర‌ణ్‌ మ‌రియు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న నాగార్జున మ‌ధ్య ఓ చిన్న రిలేష‌న్ ఉంది. నాగార్జున నిర్మాతగా.. సుమంత్ హీరోగా తెరకెక్కిన ‘సత్యం’ సినిమాతో సూర్య కిరణ్ దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే సుమంత్‌కు హీరోగా మొదటి సక్సెస్ అందించాడు సూర్య కిరణ్.

ఇక సూర్య కిరణ్‌, నాగార్జున మ‌ధ్య నిర్మాత, దర్శకుడు అనే రిలేషన్ షిప్ ఉంది. కాగా, స‌త్యం సినిమా త‌ర్వాత ధన51, రాజు భాయ్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు సూర్య కిర‌ణ్‌. ఇక తెలుగు సీనియర్ నటి కళ్యాణి సూర్య కిర‌ణ్ భార్య‌. అయితే నటి కళ్యాణి, సూర్య కిర‌ణ్ పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల‌కే విడిపోయారు.

బిగ్‌బాస్ కంటెస్టెంట్ సూర్య కిరణ్‌, నాగార్జున మ‌ధ్య‌ రిలేష‌న్ ఏంటో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts