బిబి4: నేడు హౌస్‌లో రెండో వైల్డ్ కార్డు ఎంట్రీ.. అత‌డేనా?

September 17, 2020 at 8:32 am

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న వ‌‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ ఇటీవ‌ల నాలుగో సీజ‌న్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక తొలివారం స‌త్యం డైరెక్ట‌ర్ సూర్య కిర‌ణ్ హౌస్ నుంచి ఫ‌స్ట్ ఎలిమినేట్ అవ్వ‌గా.. కుమార్ సాయి ఫ‌స్ట్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మ‌రోవైపు రెండో వారంలో అడుగుపెట్టిన ఇంటి స‌భ్యులు.. ప్రేక్ష‌కుల‌కు ఫుల్ ఎంటర్ట్మెంట్ పంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

Jabardasth Mukku Avinash Enters Bigg Boss House As A Wild Card Entry? | The  India Media

అదే స‌మ‌యంలో ఆట రంజుగా మార్చేందుకు హౌస్‌లో ఉన్నవారిని పూర్తిగా వాడేస్తున్నాడు బిగ్ బాస్. ముఖ్యంగా హౌస్‌లో మోనాల్-అభిజిత్-అఖిల్ లవ్ స్టోరీ కాస్త ఇంటరెస్టింగ్‌గా సాగుతోంది. ఇక నిన్న ‌బిగ్ బాస్ ఇచ్చిన ‘బీబీ టాలెంట్ షో’ టాస్క్ కంటిన్యూ అయింది. ఇదిలా ఉంటే.. ఈ వారం బిగ్ బాస్ రెండో వైల్డ్ కార్డు ఎంట్రీని సిద్దం చేశాడు.

‘జోకర్ వెనుక జీవిత‌మే ఉందంటూ’ వస్తోన్న బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో.. కొత్త కంటెస్టెంట్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే అంద‌ర్ని న‌వ్వించే జోక‌ర్ పాయింట్‌తో వ‌స్తున్నాడు అంటే అది క‌చ్చితంగా ముక్కు అవినాష్ అయ్యుంటాడ‌ని నెటిజన్లు భావిస్తున్నారు. మరి అతనెవరో ఈరోజు ఎపిసోడ్‌లో తేలిపోనుంది.

బిబి4: నేడు హౌస్‌లో రెండో వైల్డ్ కార్డు ఎంట్రీ.. అత‌డేనా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts