బిగ్ బాస్-4లో నేడు దేత్తడి హారిక ఔట్‌.. కానీ..

September 20, 2020 at 4:10 pm

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 ఇటీవ‌ల ప్రారంభ‌మై.. సెకెండ్ వీకెండ్‌కు చేరుకుంది. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు సూర్య కిర‌ణ్ మొద‌టి వారం ఎలిమినేట్ అయ్యారు. అయితే రెండు వారం నామినేష‌న్‌కు గత సీజన్లలలో ఎప్పుడూ లేని విధంగా తొమ్మది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. గంగవ్వ, నోయల్, కరాటే కళ్యాణి, మొనాల్ గజ్జర్, సొహైల్, అమ్మా రాజశేఖర్ కుమార్ సాయి, దేత్తడి హారిక, అభిజిత్‌లు నామినేష‌న్స్‌లో ఉన్నారు.

అయితే నామినేషన్‌లో ఉన్న తొమ్మిది మందిలో ఇద్దర్ని ఎలిమినేట్ చేస్తున్నట్టుగా చెప్పి బోండ్ పేల్చారు నాగార్జున‌. ఇక ఇప్ప‌టికే వీరిలో క‌రాటే క‌ళ్యాణి ఎలిమినేట్ అయింద‌ని శ‌నివార‌మే ప్ర‌క‌టించాడు నాగ్‌. దీంతో నేడు సెకండ్ ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రు అన్న‌ది ఉత్కంఠగా మారింది. ఇదే స‌మ‌యంలో ఓ కొత్త విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ రెండో ఎలిమినేషన్ ఫేక్ ఎలిమినేషన్ చేయ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

హౌస్‌లో ఫుల్ యాక్టివ్‌గా కొన‌సాగుతున్న‌ దేత్తడి హారికను ఎలిమినేషన్ పేరిట హౌస్ నుంచి బయటకు రప్పించి, ఆమెను సీక్రెట్ రూమ్ లో పెట్ట‌నున్న‌ట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల అనంత‌రం ఆమెను మ‌ళ్లీ హౌస్‌లోకి పంపించనున్నార‌ట‌. గతంలో రాహుల్ సిప్లిగంజ్ ను కూడా ఇదే తరహాలో ఫేక్ ఎలిమినేషన్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే ప్లాన్‌ను అమ‌లు చేయ‌నున్నార‌ని టాక్‌. కాగా, మ‌రోవైపు కుమార్ సాయి ఎలిమినేట్ చేస్తార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

బిగ్ బాస్-4లో నేడు దేత్తడి హారిక ఔట్‌.. కానీ..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts