బిబి4: బ్యాగ్ సర్దేసిన కరాటే కళ్యాణి.. నెక్ట్స్‌ అతడే?

September 20, 2020 at 7:48 am

బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచే బిగ్ బాస్ సీజ‌న్ 4 ఇటీవ‌ల ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సెకెండ్ వీకెండ్‌కు చేరుకున్న ఇంటి స‌భ్యులు.. ఎవ‌రు ఎలిమినేట్ అవుతారా అని ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వారం ఎన్న‌డూ లేనివిధంగా మొత్తం తొమ్మిది మంది ఎలిమినేష‌న్‌కు నామినేట్ అయ్యారు. ఈవారం నామినేషన్‌లో రాజశేఖర్ మాస్టర్, కుమార్ సాయి, నోయల్, గంగవ్వ, కళ్యాణి, హారిక, అభిజిత్, మోనాల్, సొహైల్‌‌లు ఉన్నాయి.

అయితే ఈ వారం సెల్ఫ్ నామినేట్ అయిన వాళ్లందరినీ సేఫ్ గేమ్ ఆడుతున్నారంటూ నాగ్ క్లాస్ పీకారు. ఈ క్ర‌మంలోనే రెండో వారం నామినేషన్‌లో ఉన్న తొమ్మిది మందిలో ఇద్దర్ని ఎలిమినేట్ చేస్తున్నట్టుగా ట్విస్ట్ ఇచ్చిన‌ నాగార్జున‌.. మొదటగా కరాటే కళ్యాణిని బయటకు పంపారు. రెండో ఎలిమినేష‌న్ ఈ రోజు జ‌ర‌గ‌నుంది.

ఇక రెండో ఎలిమినేషన్‌ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కుమార్ సాయి అని తెలుస్తోంది. ఎందుకంటే.. హౌజ్‌లోకి వెళ్లేముందు నాగార్జున దగ్గర బీరాలు పలికిన సాయి కుమార్ లోపలికి వెళ్లిన తరువాత మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయారు. అన్ని పోల్స్ ప్రకారం సైతం కుమార్ సాయి అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

బిబి4: బ్యాగ్ సర్దేసిన కరాటే కళ్యాణి.. నెక్ట్స్‌ అతడే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts