
ప్రపంచంలోని అన్ని దేశాలను కలవర పెడుతోన్న కరోనా వైరస్.. ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఎక్కడో చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత వైరస్ ధాటికి ఇప్పటికే లక్షల మంది ప్రణాలు కోల్పోయారు. కంటికి కనిపించని ఈ కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాకపోవడంతో.. రోజురోజుకు ఊహించని స్థాయిలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.
ఇదిలా ఉంటే.. ఇటీవల అట్టహాసంగా ప్రారంభమైన వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ హౌస్లో కరోనా కలకలం రేగింది. వాస్తవానికి కరోనా కారణంగా ఈ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సోను స్టార్ట్ చేసారు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే ముందు కంటెస్టెంట్స్ అందరికీ కరోనా టెస్టులు చేయడంతో పాటు వారిని 14 రోజులు పాటు క్వారంటైన్ లో ఉంచారు. అనంతరం హౌస్లోకి పంపారు.
అయితే తాజాగా ఈ వాతావరణం నాకు పడటం లేదు.. ఒళ్లు మొత్తం హూనం అయిపోతుంది..ఎన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు చెప్పినా కూడా ఆరోగ్యం మాత్రం సహకరించడం లేదు.. నిద్ర పట్టడం లేదు.. మీ కాళ్లు మొక్కుతా నన్ను ఇంటికి పంపేయండి అంటూ గంగవ్వ బోరున విలపించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు ఆరోగ్యం బాగోలేదన్న టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే మేకర్స్ మళ్ళీ ఆమెకు ఒకసారి కరోనా టెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.