అన్నాడీఎంకే పొత్తుపై తేల్చేసిన బీజేపీ…  

September 22, 2020 at 11:37 am

తమిళనాట ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీల పొత్తుల విషయంపై చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికార అన్నాడీఎంకేతో పొత్తుపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది. అన్నాడీఎంకే కూటమిలోనే బీజేపీ కొనసాగుతోందని ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే బీజేపీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఆ పార్టీ కూటమిలోనే తాము కొనసాగుతున్నామని తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలో బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతోందని అన్నారు. బీజేపీ ఏ పార్టీలతో పొత్తుపెట్టుకోకుండా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే 30 నియోజకవర్గాలను సునా యసంగా గెలుచుకునే అవకాశం ఉందని చెప్పారు.

ఇదిలా ఉంటే ప్రతిపక్ష డీఎంకేని టార్గెట్ చేసుకుని అధికార పార్టీ విమర్శలు గుప్పిస్తుంది. డీఎంకే ఒక ఆన్‌లైన్‌ పార్టీగా మారిందని రాష్ట్ర సమాచార ప్రసార శాఖ మంత్రి కడంబూర్‌ రాజు ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికలు వచ్చేలోపు డీఎంకే కూటమి ఖాళీ అవుతుందన్నారు. ప్రస్తుతం స్వతంత్రంగా ఏ ఒక్క నిర్ణయం తీసుకోలేని స్థాయికి ఆ పార్టీ మారిపోయిందన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ అన్ని కార్యక్రమాలను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తుందన్నారు.

అన్నాడీఎంకే పొత్తుపై తేల్చేసిన బీజేపీ…  
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts